మిషన్ కాకతీయలో ఎల్లారెడ్డి నియోజకవర్గం ముందుంది..

కామారెడ్డి: మిషన్ కాకతీయలో ఎల్లారెడ్డి నియోజకవర్గం రాష్ట్రంలోనే ముందుందని సీఎం కేసీఆర్ అన్నారు. ఏనుగు రవీందర్ రెడ్డి ఎల్లారెడ్డి నియోజకవర్గంలో 457కి పైగా చెరువులు బాగు చేయించుకున్నరన్నారు. గజ్వేల్ నియోజకవర్గం కంటే ఎల్లారెడ్డిలో రవీందర్‌రెడ్డి ఎక్కువ చెరువులు అభివృద్ధి చేసుకున్నరని..ఆ గౌరవం వారికే దక్కిందని సీఎం చెప్పారు. మిషన్ కాకతీయ పథకాన్ని నగర్ మండలంలోని చెరువులో ప్రారంభించిన విషయాన్ని ఈ సందర్బంగా సీఎం గుర్తు చేసుకున్నారు.

దేశమే ఆశ్చర్యపడే విధంగా తెలంగాణ అనేక రంగాల్లో అగ్రగామిగా నిలిచిందని సీఎం వెల్లడించారు. గౌడ కులస్థులకు శాశ్వతంగా చెట్ల పన్ను రద్దయిపోయింది. నాయీ బ్రాహ్మణ, రజక సోదరులను కూడా ఆదుకునే కార్యక్రమాలు ప్రారంభమైనయి. 70 శాతం ప్రజానీకం వ్యవసాయాధారంగా బతికేవారే.. కరెంట్ ఎప్పుడు వస్తదో తెలియదు. ట్రాన్స్‌ఫార్మర్లు ఎప్పుడు కాలిపోతయో తెలియదు. ఇపుడు ఆ బాధలేమి లేకుండా తెలంగాణ ప్రభుత్వం రైతులకు 24 గంటలు ఉచిత కరెంట్ ఇస్తుందని తెలిపారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కూడా ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతలేవని, కరెంట్ పోతలేదన్నారు.

ఐటీ రంగం, పారిశ్రామిక రంగంలో ముందుకు పోతున్నం. ఆడబిడ్డలను ఆదుకున్నాం. ఒంటరి మహిళలు, బీడీ కార్మికులకు వెయ్యి రూపాయలు పించన్ ఇస్తున్నం. మళ్లీ టీఆర్‌ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తది. పెన్షన్ దారులందరికీ వెయ్యి పెన్షన్‌ను పెంచి 2,016 రూపాయలు అందజేస్తమన్నారు. మిషన్ భగీkథ ద్వారా ఎల్లారెడ్డిలో అన్ని గ్రామాలకు నీళ్లు చేరాయని, నల్లాల కలెక్షన్లు ఇచ్చే పనులు కొనసాగుతున్నాయని అన్నారు. రైతు బీమా దేశంలోనే ఎక్కడా లేదు. దేశం మొత్తం ఆశ్చర్యపడే విధంగా రైతు బీమా తీసుకొచ్చినం. ఏ పైరవీ లేకుండా ఏ అధికారి వద్దకు పోకుండా వారి ఖాతాల్లో బీమా సొమ్ము పడేలా చర్యలు తీసుకుంటున్నమని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఎల్లారెడ్డి ప్రజలు ఏనుగు రవీందర్ రెడ్డిని లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.

Related Stories: