సా. 4:30 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం సమావేశం

న్యూఢిల్లీ : ఇవాళ సాయంత్రం 4:30 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం సమావేశం కానుంది. ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరాం రాష్ర్టాలతో పాటు తెలంగాణ అసెంబ్లీ ఎన్నిల అంశంపై ఎన్నికల సంఘం చర్చించనుంది. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్‌కు పిలుపువచ్చింది. ఇవాళ సాయంత్రం వరకు ఢిల్లీకి రావాలని ఆయనను కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ క్రమంలో ఇవాళ ఉదయం 31 జిల్లాల కలెక్టర్లతో రజత్ కుమార్ సమావేశమై ఎన్నికల నిర్వహణకు కావాల్సిన అవసరాలపై సమీక్షించారు. ఈవీఎంలు, వీవీప్యాట్‌లపై పూర్తిస్థాయి అవగాహన కల్పించేందుకే ఈ సమావేశం నిర్వహించినట్లు రజత్ కుమార్ తెలిపారు. ఈవీఎంలు, వీవీప్యాట్‌ల విధానంపై శిక్షణ తరగతులు నిర్వహిస్తామన్నారు. ఓటింగ్‌కు ముందు అన్ని ఓ ప్రణాళికబద్ధంగా జరుగుతాయన్నారు రజత్ కుమార్. ఓటింగ్ తేదీలు ప్రకటించే నాటికి తాము అన్ని విధాలా సిద్ధంగా ఉంటామని ఎన్నికల ప్రధానాధికారి స్పష్టం చేశారు.
× RELATED చాలెంజ్.. ఈ బీర్‌ను ఒక్క బాటిల్ కంటే ఎక్కువ తాగలేరు!