అది ఎలక్షన్ బుల్లెట్ ట్రైన్..

న్యూఢిల్లీ: జపాన్ సహకారంతో నిర్మించనున్న బుల్లెట్ ట్రైన్ నిర్మాణపనులను ప్రధాని నరేంద్రమోదీ, జపాన్ ప్రధాని షింజో అబేతో కలిసి ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే బుల్లెట్ ట్రైన్‌పై కాంగ్రెస్ పార్టీ తనదైన శైలిలో వ్యంగ్యాస్ర్తాలను విసిరింది. అహ్మదాబాద్-ముంబై హైస్పీడ్ బుల్లెట్ ట్రైన్‌ను ఎలక్షన్ బుల్లెట్ ట్రైన్ అని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. త్వరలో గుజరాత్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బుల్లెట్ ట్రైన్ పనులను ప్రారంభించారని కాంగ్రెస్ ఆరోపించింది. ప్రతీ రాష్ట్ర ఎన్నికల కంటే ముందు మోదీ ప్రభుత్వం ఇలాంటి పెద్ద ప్రాజెక్టులను ప్రజల ముందుకు తీసుకువచ్చి, ప్యాకేజీలు ప్రకటిస్తుందని కాంగ్రెస్ మండిపడింది.
× RELATED నాటు తుపాకీ స్వాధీనం: ఇంజినీరింగ్ విద్యార్ధి అరెస్టు