శైల‌జా రెడ్డి అల్లుడు వీడియో సాంగ్ విడుద‌ల‌

నాగ చైత‌న్య, అను ఎమ్యాన్యుయేల్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో మారుతి తెర‌కెక్కించిన చిత్రం శైల‌జా రెడ్డి అల్లుడు . ఈ చిత్రంలో సీనియ‌ర్ న‌టి ర‌మ్య‌కృష్ణ అత్త పాత్ర‌లో న‌టించారు . ప్రేమమ్, బాబు బంగారం వంటి చిత్రాలు నిర్మించిన సితార ఎంటర్టైన్మెంట్స్ శైల‌జా రెడ్డి అల్లుడు చిత్రాన్ని రూపొందిస్తుంది. శైల‌జా రెడ్డి చిత్రం కుటుంబ క‌థా చిత్రంగా ప్రేక్ష‌కుల‌ని తప్ప‌క అల‌రిస్తుంద‌ని మేక‌ర్స్ చెబుతున్నారు. ఆగ‌స్ట్ 31న మూవీ విడుద‌లకి ప్లాన్ చేస్తుండ‌గా, నిర్మాత‌లు మూవీపై ఆస‌క్తి క‌లిగేలా భారీ ప్ర‌మోష‌న్స్ చేస్తున్నారు. చిత్రానికి సంబంధించి విడుద‌ల అవుతున్న సాంగ్స్ ప్రేక్ష‌కుల‌లో సినిమాపై అంచ‌నాలు పెంచుతున్నాయి. తాజాగా ఎగిరెగెరే అనే సాంగ్ ప్రోమో విడుదల చేశారు. ఇందులో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో పాటు సినిమాటోగ్రఫీ చాలా అందంగా ఉంది. గోపిసుంద‌ర్ చిత్రానికి స్వ‌రాలు స‌మకూర్చారు . రీసెంట్ గా విడుద‌లైన శైలజా రెడ్డి అల్లుడు జూడే ..సాంగ్‌ని తెలంగాణ యాసలో సత్యవతి (మంగ్లీ) చే పాడించగా ఈ పాటకి హ్యూజ్ రెస్పాన్స్ వ‌స్తుంది.
× RELATED ఒంటిపై కిరోసిన్ పోసుకొని మహిళ ఆత్మహత్య