ఎన్నికల నిర్వహణ కోసం ప్రభుత్వం సరైన దిశలో వెళ్తుంది..

హైదరాబాద్: ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్రప్రభుత్వం చేస్తున్న కసరత్తు సరైన దిశలో వెళ్తుందని డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ ఉమేశ్ సిన్హా తెలిపారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో ఉమేశ్ సిన్హా నేతృత్వంలోని కేంద్ర ఎన్నికల సంఘం బృందం సమావేశమైంది. అనంతరం ఉమేష్ సిన్హా మాట్లాడుతూ..15 రోజుల్లో ఎన్నికల నిర్వహణ ఏర్పాట్ల ప్రక్రియ ముమ్మరం చేస్తామని చెప్పారు. ఎస్‌ఎంఎస్ ద్వారా ఓటర్ జాబితాలో పేరు ఉందో కనుక్కునే సౌకర్యాన్ని కల్పించనున్నట్లు చెప్పారు. అతి త్వరలో ఎస్‌ఎంఎస్ ఆన్‌లైన్ గేట్‌వే ప్రారంభిస్తామని తెలిపారు. డీఎల్‌వోలు కాకుండా ఉన్నతాధికారులు కూడా పోలింగ్ స్టేషన్ల వారీగా వెరిఫికేషన్ ప్రక్రియలో పాల్గొనాలన్నారు. హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లగానే నివేదిక సమర్పిస్తామన్నారు.

Related Stories: