నవజ్యోత్‌సింగ్‌ సిద్ధుకు ఈసీ నోటీసులు

ఛండీగఢ్ : పంజాబ్‌ మంత్రి నవజ్యోత్‌సింగ్‌ సిద్ధుకు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. బీహార్‌లోని కతిహార్‌లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ముస్లిం ఓట్లు చీల్చవద్దంటూ సిద్దూ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో..ఈసీ ఆయనకు నోటీసులు జారీచేసింది. ఎన్నికల ర్యాలీలో చేసిన ఈ వ్యాఖ్యలపై 24 గంటల్లోగా వివరణ ఇవ్వాలని ఎన్నికల సంఘం సిద్దూను ఆదేశించింది.
More in జాతీయం :