మొత్తం 3వేల 583 నామినేషన్లు దాఖలు: సీఈవో రజత్ కుమార్

హైదరాబాద్: ఓటింగ్ శాతం పెంచేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ తెలిపారు. త్వరలోనే ఓటర్ స్లిప్ పంపిణీ మొదలు పెడుతామని చెప్పారు. ఓటర్ స్లిప్ కుటుంబ సభ్యులకే ఇవ్వాలని సూచించారు. మీడియా సమావేశంలో ఎన్నికల నిర్వహణ, ఏర్పాట్లపై మాట్లాడారు. ఈ సందర్భంగా రజత్ కుమార్ మాట్లాడుతూ.. పోలింగ్ స్టేషన్ల పెంపునకు, మార్పునకు విజ్ఞప్తులు వచ్చాయి. రాష్ట్రంలో 32వేల 796 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. సర్వీస్ ఓటర్లు 9వేల 445 మంది ఉన్నారు. ఓటర్ నమోదుకు మంచి స్పందన వచ్చింది. లక్షా 60వేల 509 మంది పోలింగ్ సిబ్బందిని అవసరమవుతారు. పోలింగ్ సిబ్బంది నియామకం కోసం సీఈసీని అనుమతి కోరుతాం.

పోలింగ్ 30వేల మంది పోలీసులతో బందోబస్తు. మన రాష్ట్రంలో 18వేల మంది పోలీస్ బందోబస్త్ ఉన్నారు. ఛత్తీస్ మధ్యప్రదేశ్ రాష్ర్టాల నుంచి అదనపు భద్రతా బలగాలను రప్పిస్తాం.మొత్తం 3వేల 583 నామినేషన్లు దాఖలు అయ్యాయి. పోలింగ్ అదనపు సిబ్బందిని అందుబాటులో ఉంచుతాం. పోలింగ్ రోజు ఓటర్ల జాబితాను పోలింగ్ కేంద్రాల దగ్గర అందుబాటులో ఉంచుతాం. పంపిణీ చేయగా మిగిలిన పోలింగ్ స్లిప్పులను ఎన్నికల రోజు పోలింగ్ బూత్ దగ్గర ఉంచుతాం. గత ఎన్నికల తీరుకు.. ప్రస్తుత ఎన్నికల తీరుకు కొంత తేడాలు ఉన్నాయి. ప్రజలకు పోలింగ్ తీరుపై అవగాహన కల్పించామని రజత్ పేర్కొన్నారు.

Related Stories: