జమ్మూకశ్మీర్, హర్యానాలో స్వల్ప భూప్రకంపనలు

న్యూఢిల్లీ : జమ్మూకశ్మీర్, హర్యానాలో ఇవాళ తెల్లవారుజామున స్వల్పంగా భూప్రకంపనలు సంభవించాయి. తెల్లవారుజామున 5:15 గంటలకు జమ్మూకశ్మీర్‌లో స్వల్పంగా భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.6గా నమోదైంది. భూమికి 174 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం కేంద్రీకృతమైనట్లు భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇక హర్యానాలోని జాజ్జర్‌లో కూడా 5:43 గంటలకు భూమి కంపించింది. ఇక్కడ రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.1గా నమోదైంది. భూమి స్వల్పంగా కంపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఈ రెండు ఘటనల్లో ఎలాంటి ప్రమాదం సంభవించలేదని అధికారులు పేర్కొన్నారు.

Related Stories: