హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ స్వాధీనం

హైదరాబాద్ : నగరంలో డ్రగ్స్ సరఫరా చేస్తున్న వ్యక్తిని ఆబ్కారీ శాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు అబ్దుల్ హామీద్ నుంచి 31 గ్రాముల కొకైన్, రూ. 7 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌లో హామీద్ డ్రగ్స్‌ను విక్రయిస్తున్నట్లు అధికారులు నిర్ధారించారు. నిందితుడు హైదరాబాద్‌లో ప్రయివేటు ట్రావెల్స్ నడుపుతున్నాడు. డ్రగ్స్‌ను గోవా నుంచి హైదరాబాద్‌కు హామీద్ తరలిస్తున్నట్లు ఆబ్కారీ శాఖ అధికారులు తెలిపారు. నిందితుడు హామీద్‌పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Related Stories: