డ్రైవర్ ఎంపవర్‌మెంట్‌కు దరఖాస్తుల ఆహ్వానం

రంగారెడ్డి : రంగారెడ్డి జిల్లా పరిధిలో షెడ్యూల్డ్ కులాల సేవా సహకార, అభివృద్ధి సంఘం ప్రవేశపెట్టిన డ్రైవర్ ఎంపవర్‌మెంట్ పథకానికి షెడ్యూల్డ్ కులాల వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సంఘం పేర్కొంది. ఈ పథకంలో భాగంగా కార్ ట్యాక్సీలు, మోటర్ బైక్‌లు నడిపేందుకు డ్రైవర్ల నియామకం జరుగుతుందని తెలిపారు. ఓలా, మేరు, స్విగ్గి, బిగ్‌బాస్కెట్ తదితర ప్రైవేటు సంస్థలకు అభ్యర్థులను అనుసంధానిస్తామని సంఘం పేర్కొంది. అర్హులైన అభ్యర్థులు ఈనెల 27లోపు లక్డీకాపూల్‌లోని రంగారెడి జిల్లా కలెక్టరేట్‌లో సంప్రదించి, తమ దరఖాస్తులను సమర్పించాలని అధికారులు సూచించారు.
× RELATED సీఎం సభాస్థలిని పరిశీలించిన జీవన్‌రెడ్డి, కేఆర్ సురేశ్‌రెడ్డి