గ్రీన్ టీ తో క్యాన్స‌ర్ దూరం..!

రోజూ గ్రీన్ టీ తాగ‌డం వ‌ల్ల ఎలాటి ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే. గ్రీన్ టీ తాగ‌డం వ‌ల్ల శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగ‌తుంది. అధిక బ‌రువు త‌గ్గుతారు. గుండె జ‌బ్బులు రాకుండా ఉంటాయి. దీంతోపాటు డ‌యాబెటిస్ అదుపులో ఉంటుంది. ర‌క్తంలో గ్లూకోజ్ స్థాయిలు కంట్రోల్ అవుతాయి. ఇంకా ఎన్నో లాభాలు మ‌న‌కు గ్రీన్ టీ తాగ‌డం వ‌ల్ల క‌లుగుతాయి. అయితే గ్రీన్ టీ తాగ‌డం వ‌ల్ల క్యాన్స‌ర్ కూడా రాకుండా ఉంటుంద‌ని ప‌లువురు సైంటిస్టులు చేసిన తాజా ప‌రిశోధ‌న‌ల్లో తెలిసింది.

గ్రీన్ టీ ని నిత్యం తాగ‌డం వ‌ల్ల క్యాన్స‌ర్ క‌ణాల వృద్ది త‌గ్గుతుంద‌ట‌. క్యాన్స‌ర్ క‌ణాల వృద్ధిని నియంత్రించ‌డంలో గ్రీన్ టీ ముఖ్య పాత్ర పోషిస్తుంద‌ట‌. యూకేలోని సాల్ఫోర్డ్ యూనివ‌ర్సిటీ సైంటిస్టులు ఈ విషయాల‌ను తాజాగా వెల్లడించారు. గ్రీన్ టీ ఆకుల్లో ఉండే ప‌లు ఔష‌ధ కార‌కాలు మైటోకాండ్రియా జీవ‌క్రియ‌ను నియంత్రిస్తాయని వారు తెలిపారు. ఈ క్ర‌మంలో నిత్యం కొద్దిగా గ్రీన్ టీ తాగినా చాలు.. క్యాన్స‌ర్ క‌ణాలు నిద్రాణ స్థితిలోకి వెళ్తాయ‌ని సైంటిస్టులు చెబుతున్నారు. క‌నుక నిత్యం గ్రీన్ టీ తాగాల‌ని వారు సూచిస్తున్నారు.

Related Stories: