చేవెళ్లలో టీఆర్‌ఎస్ అభ్యర్థి రంజిత్‌రెడ్డి విజయం

రంగారెడ్డి: చేవెళ్ల లోక్ సభ స్థానంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి రంజిత్‌రెడ్డి విజయం సాధించారు. హోరాహోరీగా సాగిన పోరులో కాంగ్రెస్ అభ్యర్థి కొండావిశ్వేశ్వర్‌రెడ్డిపై 14,400 ఓట్ల మెజార్టీతో రంజిత్‌రెడ్డి విజయకేతనం ఎగరవేశారు. తన విజయానికి కృషి చేసిన ప్రతీ ఒక్కరికి రంజిత్‌రెడ్డి పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు. చేవెళ్ల ప్రజలందరికీ సేవ చేస్తానని ఈ సందర్భంగా హామీనిచ్చారు. ఇవాళ ఉదయం కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి చేవెళ్ల స్థానంలో ఎవరు గెలుస్తారని ఉత్కంఠ నెలకొన్న విషయం తెలిసిందే.