కపిల్‌దేవ్‌తో పోలికెందుకు? గావస్కర్

న్యూఢిల్లీ: టీమిండియా లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్‌ను ఎవరితోనూ పోల్చకూడదని భారత మాజీ కెప్టెన్ సునీల్ గావస్కర్ అన్నారు. కొద్ది రోజులుగా యువ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యను కపిల్‌తో పోల్చుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అలాంటి వ్యాఖ్యలను గావస్కర్ కొట్టిపారేశారు. కపిల్‌దేవ్‌ను ఎవరితోనూ పోల్చకూడదు. అతను కేవలం ఒక తరానికి మాత్రమే పరిమితమయ్యే ఆటగాడు కాదు. సర్ డాన్ బ్రాడ్‌మాన్, సచిన్ టెండూల్కర్‌లా శతాబ్దానికొక్క ఆటగాడు.అని ఓ ఛానెల్‌తో ఇంటర్వ్యూలో లిటిల్ మాస్టర్ తెలిపారు. ధావన్ ఆట మార్చుకో..! సుధీర్ఘ ఫార్మాట్‌లో ఓపెనర్ శిఖర్ ధావన్ బ్యాటింగ్ శైలిపై గావస్కర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బర్మింగ్‌హోమ్‌లో జరిగిన తొలి టెస్టులో అతడు 26, 13 పరుగులతో దారుణ ప్రదర్శన చేశాడు. టెస్టులకు తగ్గట్లుగా తన ఆటతీరు మార్చుకోవడానికి ధావన్ ఇష్టపడట్లేదు. ఇప్పటి వరకు విజయవంతమైన పరిమిత ఓవర్ల క్రికెట్ మాదిరిగానే ఈ ఫార్మాట్‌లోనూ ఆడుతున్నాడు. వన్డేల్లో స్లిప్‌లో ఫీల్డర్లు ఉండరు కనుక అతను ఇలాంటి షాట్లు అక్కడ ఆడితే ఎలాంటి సమస్య ఉండదు. అవి నేరుగా బౌండరీ వెళ్తాయి. అయితే టెస్టుల్లో బంతి బ్యాట్‌కు ఎడ్జ్ అయితే వికెట్ కోల్పోవాల్సిందేనని గావస్కర్ పేర్కొన్నారు.
× RELATED రేపు నగరంలో ట్రాఫిక్ అంక్షలు..