ప్రభుత్వ కార్లను వ్యక్తిగతానికి వాడొద్దు

న్యూఢిల్లీ: దుబారా ఖర్చు తగ్గించడంపై ఢిల్లీ ప్రభుత్వం దృష్టిసారించింది. ఇందులోభాగంగా ప్రభుత్వం సమకూర్చే వాహనాలను, కార్లను అధికారిక కార్యక్రమాల కోసం తప్ప వ్యక్తిగత అవసరాల కోసం వాడొద్దని అధికారులకు స్పష్టంచేసింది. అధికారిక కార్యక్రమాల కోసం వినియోగించే కార్లకు సంబంధించిన వివరాలను ప్రతినెల 20 తేదీన సమర్పించాలని అన్నిశాఖల అధికారులను ఢిల్లీ సాంఘిక సంక్షేమ విభాగం శనివారం ఆదేశించింది. కొందరు అధికారులు ఆఫీసు కారును వ్యక్తిగత అవసరాల కోసం కూడా వినియోగిస్తూ, రవాణా భత్యం తీసుకుంటున్న నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నది. వివిధ శాఖలకు ఎన్ని వాహనాలు అద్దెకు తీసుకున్నారు? వాటికి ఎంత ఖర్చవుతుందనే వివరాలను పదిరోజుల్లో సమర్పించాలని గతనెలలో ముఖ్యకార్యదర్శులను ప్రభుత్వం ఆదేశించింది.
× RELATED యోగా టీచర్ కావాలనుకునే వారికి సువర్ణావకాశం..