భారత ఆర్చర్లకు నిరాశ

archery అంటాల్య: ప్రపంచ కప్ స్టేజ్-త్రీ టోర్నీలో భారత ఆర్చర్లకు నిరాశ ఎదురైంది. శుక్రవారం జరిగిన మిక్స్‌డ్ రికర్వ్ టీమ్ ఈవెంటులో బరిలోకి దిగిన దీపికా కుమారి, తరుణ్‌దీప్ రాయ్ జోడీ 4-5 తేడాతో యాస్మిన్ అంగోజ్, మెటె గాజోజ్(టర్కీ) ద్వయం చేతిలోఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. అంతకుముందు జరిగిన వ్యక్తిగత విభాగపు పోటీల్లో తరుణ్‌దీప్ రాయ్, దీపిక, బొంబాల్య దేవి, అతుల్‌వర్మ తమ పోరాటాన్ని ముగించారు. కాంపౌండ్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంటులో రజత్ చౌహాన్, వెన్నెం జ్యోతి సురేఖ రెండో రౌండ్‌లోనే వెనుదిరిగారు. పురుషుల, మహిళల కాంపౌండ్ టీమ్ ఈవెంట్లలో భారత్ కాంస్య పతకాల కోసం పోరాడనుంది.