భువనేశ్వర్ ఎయిర్‌పోర్టులో 5 కేజీల బంగారం స్వాధీనం

భువనేశ్వర్ : ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లోని ఎయిర్‌పోర్టులో డీఆర్‌ఐ అధికారులు తనిఖీలు చేశారు. ముగ్గురు ప్రయాణికుల నుంచి 5.822 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన బంగారం విలువ రూ. 1.88 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఈ ముగ్గురు ప్రయాణికులు కౌలాలంపూర్ నుంచి భువనేశ్వర్‌కు వచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
× RELATED పొడి ప్రదేశాల్లో సైతం నీటిని పుట్టించుకోవచ్చునని..