శ్రీవారిని దర్శించుకున్న సినీ దర్శకుడు శ్రీను వైట్ల

తిరుమల : తిరుమల శ్రీవారిని ప్రముఖ సినీ దర్శకుడు శ్రీను వైట్ల దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు ఆయనకు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో శ్రీనువైట్లకు వేదపండితులు వేదశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామి వారి తీర్థప్రసాదాలు అందించి పట్టువస్త్రంతో సత్కరించారు. శ్రీవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని శ్రీను వైట్ల అన్నారు. ఈ నెల 16న అమర్ అక్బర్ ఆంటోనీ సినిమా విడుదల సందర్భంగా స్వామి వారి ఆశీస్సులు కోసం తిరుమలకు వచ్చానని ఆయన అన్నారు. ప్రేక్షకుల దగ్గర మంచి సినిమాగా ఆదరణ పొందుతుందని శ్రీను వైట్ల పేర్కొన్నారు.

Related Stories: