విజ‌య్ 'టాక్సీవాలా'వాయిదాపై క్లారిటీ ఇచ్చిన ద‌ర్శ‌కుడు

పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం చిత్రాలతో అందరి దృష్టి ఆకర్షించిన విజయ్ దేవరకొండ త్వరలో టాక్సీ వాలా అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇటీవ‌ల‌ ఫస్ట్ గేర్ అంటూ మూవీ టీజర్ విడుదల చేసి సినిమాపై ఆస‌క్తిని పెంచింది చిత్ర బృందం . చిత్రంలో క‌థానాయికగా షార్ట్ ఫిలింస్ బ్యూటీ ప్రియాంక జవల్కర్ న‌టించింది. జీఏ2 పిక్చర్స్ మరియు యూవీ క్రియేషన్స్ బేనర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. టాక్సీ డ్రైవర్ చుట్టూ ఈ మూవీ కథ తిరుగుతుందని తెలుస్తుంది. మాళవిక నాయర్ కూడా ఓ హీరోయిన్ గా క‌నిపించ‌నుంది . విజయ్ దేవరకొండ ఈ చిత్రంలో శివ పాత్రలో టాక్సీ డ్రైవర్ గా కనిపించనున్నాడు. రాహుల్ సంకృతియన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం ఈ మూవీ నిర్మాణాంత‌ర కార్యక్ర‌మాలు జ‌రుపుకుంటుంది.

కొద్ది రోజులుగా టాక్సీ వాలా చిత్రానికి సంబంధించి ప‌లు పుకార్లు షికారు చేస్తున్నాయి. మూవీకి సంబంధించి కొన్ని స‌న్నివేశాలు రీషూట్ చేస్తున్న కార‌ణంగా టాక్సీవాలా చిత్ర విడుద‌ల వాయిదా ప‌డుతుంద‌ని ప్ర‌చారం జ‌రిగింది. దీనిపై చిత్ర ద‌ర్శ‌కుడు త‌న ఫేస్ బుక్ పేజ్ ద్వారా క్లారిటీ ఇచ్చాడు. టాక్సీవాలా చిత్రం కేవ‌లం గ్రాఫిక్ వ‌ర్క్ కార‌ణంగానే లేట్ అవుతుంది త‌ప్ప సినిమాలో ఒక్క షాట్ కూడా రీషూట్ చేయ‌డం లేదని వివ‌ర‌ణ ఇచ్చాడు. త్వ‌ర‌లోనే ఈ మూవీకి సంబంధించిన రిలీజ్ డేట్ అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టిస్తామ‌ని అన్నాడు. వ‌రుస హిట్స్ తో మంచి జోరు మీదున్న విజ‌య్ దేవ‌ర‌కొండ ఈ సినిమాతోను అల‌రిస్తాడ‌ని ప్రేక్ష‌కులు భావిస్తున్నారు.

Related Stories: