దినేష్ కార్తీక్ లాస్ట్ బాల్ సిక్స్ చూశారా.. వీడియో

కొలంబోః క్రికెట్‌లో చివరి బంతి వరకూ ఏం జరుగుతుందో ఊహించడం కష్టం. దానికి తాజా నిదర్శనం ఇండియా, బంగ్లాదేశ్ మధ్య జరిగిన టీ20 ట్రై సిరీస్ ఫైనల్ మ్యాచ్. ఒక దశలో భారత్ గెలుపు దాదాపు అసాధ్యమే అనుకున్నారంతా. కానీ దినేష్ కార్తీక్ దాన్ని సాధించి చూపాడు. చివర్లో వచ్చి మెరుపులు మెరిపించిన కార్తీక్ కేవలం 8 బంతుల్లో 29 పరుగులు చేశాడు. చివరి బంతికి సిక్స్ మొత్తం మ్యాచ్‌కే హైలైట్. టీమిండియా గెలవాలంటే చివరి బాల్‌కు 5 పరుగులు చేయాల్సి ఉంది. ఫోర్ కొడితే సూపర్ ఓవర్. ఇలాంటి దశలో బంగ్లా పార్ట్‌టైమ్ బౌలర్ సౌమ్య సర్కార్.. వికెట్లకు దూరంగా వేసిన బంతిని కవర్స్ మీదుగా సిక్సర్‌గా మలిచాడు కార్తీక్. అంతే భారత అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోగా.. బంగ్లా ప్లేయర్స్ గ్రౌండ్‌లోనే కుప్పకూలారు.

Related Stories: