భారతీయ మూలాలున్న 70 పదాల కూర్పు

హైదరాబాద్: మన దేశంలో ఆంగ్లభాష వ్యాప్తికి కృషి చేస్తున్న బ్రిటీష్ కౌన్సిల్ 70 వసంతాల వేడులకు సిద్ధమైంది. మన దేశంలో కౌన్సిల్ సేవలు ప్రారంభమై 70 ఏండ్లు పూర్తయిన సందర్భంగా ఈ వేడుకలను వినూత్నంగా నిర్వహించుకుంటున్నారు. భారతీయ మూలాలున్న 70 పదాలను డిక్షనరీ నుంచి సేకరించి మన కళాకారులతో చిత్రాలుగా ప్రదర్శించనున్నది. రైతా, పాష్మినా, బేల్‌పూరి, దాల్, చట్నీ ఈ పదాలు అటు ఇంగ్లిష్, ఇటు భారతీయ భాషల్లోనూ కనిపిస్తాయి. ఇలాంటివే 70 పదాలను ఎంచుకుని 14 చిత్రాల రూపంలో బ్రిటీష్ కౌన్సిల్ మైక్రోసైట్‌లో పొందుపరిచింది. ఈ సందర్భంగా బ్రిటీష్ కౌన్సిల్ ఓబీఈ డైరెక్టర్ అలెన్ గెమ్మెల్ మాట్లాడుతూ.. దశాబ్దాలుగా బ్రిటన్, భారత ప్రజల మధ్య ఆలోచనలు, భాష, వస్తువులు, సేవలు ఇరువైపులా మార్పిడికి గురయ్యాయని అభిప్రాయపడ్డారు. ఇది రెండు దేశాల మధ్య దృఢమైన సంబంధాలకు దారితీసిందన్నారు. భారత్‌తో 70 ఏండ్ల సంబంధం మాకు స్ఫూర్తినిచ్చిందన్నారు. పదాల్లో కొన్ని : బ్యాంగిల్, చుడిదార్, కమ్మర్‌బండ్, పైజామా, జింఖానా, బంగ్లా, కర్రీ, టిఫిన్, స్వామి, షాంపూ, ట్యాంక్, జూట్, చీతా, మైనా, టేకు, రోటి, పంచ్, ఖుషీ, కాయిర్, అవరాత్, ధర్మ, గురు, కర్మ, మంత్ర, యోగా తదితర పదాలున్నాయి.

Related Stories: