ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ తో ఎంపీ ఓవైసీ భేటీ

హైదరాబాద్ : ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుతో ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఇవాళ మధ్యహ్నాం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పోలింగ్ సరళి, ఓట్ల లెక్కింపు అంశాలపై కేసీఆర్ తో ఓవైసీ చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. టీ ఆర్ ఎస్ కు మజ్లిస్ అండగా ఉంటుందని, కేసీఆరే పూర్తి స్థాయి మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారని ఓవైసీ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రగతి భవన్ కు ఓవైసీ బైక్ పై వచ్చారు.

Related Stories: