ధనుష్‌ పై అప్పుడు విమర్శలు.. ఇప్పుడు పొగడ్తలు

తమిళ హీరో ధనుష్‌ ప్రస్తుతం స్టార్ హీరో రేంజ్ లో ఉన్నాడంటే అందుకు కారణం ఆయన కృషి, పట్టుదల. రజనీకాంత్ అల్లుడిగా కాకుండా కేవలం తన టాలెంట్ తోనే ఈ స్థాయికి ఎదిగాడు. ఎంతో మందికి ఆదర్శంగా కూడా ఉన్నాడు. అయితే ఆ మధ్య సుచీ లీక్ వ్యవహారంలో ధనుష్‌ పేరు రావడం, ధనుష్ మా కొడుకే అంటూ ఓ కుటుంబం కోర్టు కెక్కడం వంటి విషయాల వలన ఆయన ఇమేజ్ కాస్త డ్యామేజ్ అయింది. పలు విమర్శలు కూడా వచ్చాయి. అయితే తాజాగా ఆయన చేసిన మంచి పనిని ప్రతి ఒక్కరు మెచ్చుకుంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ధనుష్‌ తల్లి స్వస్థలం తమిళనాడు తేని జిల్లాలోని శంకరాపురం గ్రామంలో కొందరు రైతులు ఆత్మహత్యలు చేసుకోగా, మరి కొందరు అనారోగ్యంతో మరణించారు. మనకు అన్నం పెట్టే రైతులు ఇలా తనువు చాలిస్తుండడంతో కలత చెందిన ధనుష్‌ వారిని ఆదుకోవాలని భావించాడు. అందుకోసం తొలి విడగా 125 కుటుంబాలకు 63 లక్షల ఆర్ధిక సాయాన్ని అందించాడు. మరో విడతలో మిగతా 125 కుటుంబాలకు కూడా ఆర్ధిక సాయం చేస్తానని ధనుష్‌ అన్నాడు. సినిమా విషయానికి వస్తే ధనుష్‌ వీఐపీ 2 చిత్రం ఈ నెలలోనే విడుదల కానుంది.

Related Stories: