నిఘానీడలో నేడు నిమజ్జనం

-అన్నిపాయింట్ల వద్ద సీసీటీవీల ఏర్పాటు -31 జిల్లాల్లో పర్యవేక్షణకు కమాండ్ కంట్రోల్ సెంటర్ -రాష్ట్రవ్యాప్తంగా 74,809 గణేశ్ విగ్రహాలకు జియోట్యాగింగ్: డీజీపీ వెల్లడి -నమస్తే తెలంగాణతో డీజీపీ మహేందర్‌రెడ్డి
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం గణపతి విగ్రహాల నిమజ్జనం ప్రశాంతంగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లుచేసినట్టు డీజీపీ మహేందర్‌రెడ్డి చెప్పారు. రాష్ట్రంలోని అన్ని నిమజ్జన పాయింట్లలో సీసీటీవీలను ఏర్పాటుచేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షించేలా పూర్తిస్థాయిలో సాంకేతికతను వినియోగిస్తున్నామని నమస్తే తెలంగాణకు తెలిపారు. పోలీస్ నిఘానీడలో ప్రశాంతంగా నిమజ్జనం పూర్తిచేసేలా చర్యలు చేపట్టిన ట్టు వెల్లడించారు. మండపాల నిర్వాహకులు, సామాన్య ప్రజలు, పోలీసులంతా భాగస్వాములై నిమజ్జాన్ని ఉత్సాహపూరిత వాతావరణంలో పూర్తిచేసేలా ఏర్పాట్లుచేశామన్నారు. మొత్తం 74,809 గణేశ్ విగ్రహాలకు జియోట్యాగింగ్ చేసినట్టు డీజీపీ తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడ ఎవరు విగ్రహం పెట్టారు.. ఎప్పుడు నిమజ్జనం చేస్తారు.. ఆ పరిధిలో ఎవరు బందోబస్తు నిర్వహిస్తున్నారు.. ఇలా అన్ని వివరాలు ఒక్కక్లిక్‌తో డీజీపీ కార్యాలయం నుంచి తెలుసుకునేలా డాటాబేస్‌ను తయారుచేసినట్టు తెలిపారు. నిమజ్జన ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాలు ఆయా జిల్లా, కమిషనరేట్ పరిధిలోని హెడ్‌క్వార్టర్స్‌లో కంట్రోల్ రూంకు, వాటన్నింటిని కలిపి డీజీ పీ కార్యాలయంలోని కంట్రోల్‌రూంకు అనుసంధానం చేసినట్టు చెప్పారు. దీంతో అన్నిజిల్లాల్లో నిమజ్జనాన్ని సైతం హైదరాబాద్ నుంచే పర్యవేక్షించవచ్చన్నారు. హైదరాబాద్ సహా పెద్ద నగరాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా గూగుల్‌మ్యాప్‌లను వినియోగిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా నిమజ్జనానికి ఆటంకం కలిగించేలా ఎవరైనా ప్రవర్తించినా, రెచ్చగొట్టే వ్యాఖ్యలను సోషల్ మీడియాలో పోస్టుచేసినా సత్వరం స్పందించే నిఘా వ్యవస్థను సిద్ధంచేశామన్నారు.

మహాగణపతి మధ్యాహ్నంలోపే..

ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్రను ఆదివా రం ఉదయం 6 గంటలకు ప్రారంభించి మధ్యా హ్నం 12 వరకు నిమజ్జనం పూర్తిచేసేలా నిర్వాహకులు ఏర్పాట్లుచేశారని డీజీపీ చెప్పారు. గణేశ్ నవరాత్రి ఉత్సవాల ప్రారంభానికి ముందునుంచే రాష్ట్రవ్యాప్తంగా ఉత్సవాలు, నిమజ్జనాల బందోబస్తుకు ప్రణాళికలు రూపొందించుకున్నట్టు చెప్పారు. హైదరాబాద్ సహా పెద్ద నగరాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా గూగుల్‌మ్యాప్‌లను వినియోగిస్తున్న ట్టు తెలిపారు. హైదరాబాద్ గణేశ్ నిమజ్జనానికి సర్వం సిద్ధం చేశామని, క్రేన్లలో కొన్ని మార్పులు చేయడంతో ఈ సారి నిమజ్జనాలు మరింత త్వరగాఅయ్యే అవకాశం ఉన్నదన్నారు. సోమవారం ఉద యం వరకు నిమజ్జనం పూర్తిచేస్తామని, ఆ రోజు విధులకు వెళ్లేవాళ్లకు ఎలాంటి అవాంతరాలు లేకుం డా చర్యలు తీసుకుంటామని వివరించారు.