82 మంది డీఎస్పీల బదిలీ

-ఉత్తర్వులు జారీచేసిన డీజీపీ మహేందర్‌రెడ్డి హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో 82 మంది డీఎస్పీలను బదిలీచేస్తూ డీజీపీ ఎం మహేందర్‌రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. ఒకేచోట ఎక్కువ కాలంగా పనిచేస్తున్న డీఎస్పీలను బదిలీ చేయడంతోపాటు ఇటీవల ఇన్‌స్పెక్టర్ నుంచి ఏసీపీగా పదోన్నతి పొందినవారికి కూడా పోస్టింగ్‌లు ఇస్తూ ఆదేశాలు ఇచ్చారు. వీరితోపాటు చీఫ్ ఆఫీస్‌లో వెయిటింగ్‌లో ఉన్నవారికి తాజాగా పోస్టింగులిచ్చారు.