తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి సాధారణ సర్వ దర్శనానికి భక్తులు 16 కంపార్ట్‌మెంట్‌లలో వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 6 గంటలు, టైమ్‌స్లాట్ టోకెన్లు పొందిన భక్తులకు 2 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 71,563 మంది భక్తులు దర్శించుకోగా, 27,429 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 1.92 కోట్లు. శ్రీవారి పుష్కరిణిలో వైభవంగా చక్రస్నానం తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నానం కార్యక్రమం వైభవంగా జరిగింది. ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. పుష్కరస్నానం ఆచరించేందుకు భక్తులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. సాయంత్రం తిరుచ్చి ఉత్సవం, ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.

Related Stories: