వృద్ధాప్యంలో పిల్లల్నికంటే అనారోగ్యం

హైదరాబాద్: వయసు ఎక్కువైన అనంతరం సంతానం కోసం ప్రయత్నించే తండ్రులతో తల్లి, శిశువుకు ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయని బ్రిటిష్ జర్నల్ విశ్లేషించింది. అక్టోబర్, నవంబర్ మాసాల్లో ఆసియా, బ్రిటన్‌లోని స్త్రీ, శిశు సంబంధమైన వైద్యుల భాగస్వామ్యంతో బ్రిటిష్ జర్నల్ ఒక అధ్యయనం చేపట్టింది. ఈ సర్వేలో పాలుపంచుకున్న హైదరాబాద్‌లోని ఇందిరా ఐవీఎఫ్ దవాఖాన వైద్యురాలు డాక్టర్ స్వాతి మోతె అధ్యయనం ఫలితాలను మీడియాకు వెల్లడించారు. వయసు పెరిగే కొద్ది మహిళల్లో అండాల సంఖ్య తగ్గిపోయినట్టే.. పురుషుల్లో కూడా వీర్య ఉత్పత్తి తగ్గుతుందని చెప్పారు. సంతానం కావాలనుకొనేవారు వయసు పెరుగకముందే జాగ్రత్త వహించాలని సూచించారు.

Related Stories: