నాగ్‌-నాని మ‌ల్టీస్టార‌ర్ చిత్రానికి క్లాసిక్ టైటిల్‌..!

నాని, నాగ్ కాంబినేష‌న్‌లో క్రేజీ మ‌ల్టీస్టార‌ర్ ప్రాజెక్ట్ తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. శ్రీరామ్ ఆదిత్య తెర‌కెక్కిస్తున్న ఈ సినిమాపై అభిమానుల‌లో భారీ అంచ‌నాలు ఉన్నాయి. వైజ‌యంతి మూవీస్ ప‌తాకంపై అశ్వినీద‌త్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ‌రవేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రంలో నాని స‌ర‌స‌న ఛ‌లో ఫేం రష్మిక మందాన, నాగార్జున స‌ర‌స‌న ఆకాంక్ష సింగ్ క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు. సంపూర్ణేష్ బాబు కూడా చిత్రంలో కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. మెట్రో ట్రైన్‌లో షూటింగ్ జ‌రుపుకున్న తొలి చిత్రం ఇదే కాగా, ఈ మూవీ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతుంద‌ని తెలుస్తుంది. చిత్రంలో నాగార్జున డాన్‌గా క‌నిపిస్తే, నాని డాక్ట‌ర్ పాత్ర పోషిస్తున్నాడ‌ని అంటున్నారు. అయితే ఈ చిత్రం వినాయ‌క చివితి శుభాకాంక్ష‌ల‌తో సెప్టెంబ‌ర్ 13న గ్రాండ్‌గా విడుద‌ల కానుందని తెలుస్తుంది. మెలోడీ బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి 1953లో ఏఎన్ఆర్ న‌టించిన‌చిత్రం దేవ‌దాసు టైట‌ల్‌ని ప‌రిశీలిస్తున్నార‌ట‌. తెలుగు సినిమాలో క్లాసిక్ మూవీగా నిలిచిన ఈ చిత్ర టైటిల్‌ని ఆయ‌న త‌న‌యుడు నాగార్జున వాడుకోవ‌డం విశేషం. త్వ‌ర‌లోనే దీనిపై క్లారిటీ రానుంది.
× RELATED మధ్య‌ప్రదేశ్‌లో బీజేపీకి షాక్