ఒకే ఫ్రేములో 'దేవ‌దాస్'చిత్ర బృందం

టాలీవుడ్ న‌వ‌మ‌న్మ‌ధుడు నాగార్జున‌, నేచుర‌ల్ స్టార్ నాని ప్ర‌ధాన పాత్ర‌ల‌లో శ్రీరామ్ ఆదిత్య తెర‌కెక్కిస్తున్న చిత్రం దేవ‌దాస్‌. వైజ‌యంతి మూవీస్ ప‌తాకంపై అశ్వినీద‌త్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నాని స‌ర‌స‌న ఛ‌లో ఫేం రష్మిక మందాన, నాగార్జున స‌ర‌స‌న ఆకాంక్ష సింగ్ క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు. సంపూర్ణేష్ బాబు కూడా చిత్రంలో కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. మెట్రో ట్రైన్‌లో షూటింగ్ జ‌రుపుకున్న తొలి చిత్రం ఇదే కాగా, ఈ మూవీ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతుంద‌ని తెలుస్తుంది. అయితే ఈ చిత్ర షూటింగ్ దాదాపు పూర్తైంద‌ని తెలియ‌జేస్తూ మూవీ టీం అందిరితో క‌లిసి దిగిన సెల్ఫీని శ్రీరామ్ ఆదిత్య త‌న ట్విట్ట‌ర్‌లో షేర్ చేశాడు. ఇందులో నాని, నాగార్జున కూడా క‌నిపిస్తున్నారు. ఇటీవ‌ల విడుద‌లైన దేవదాస్ చిత్ర ఫ‌స్ట్ లుక్ సినిమాపై భారీ అంచ‌నాలు పెంచింది. ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ లో నాగార్జున, నాని బెడ్ పై నిద్రిస్తున్నారు. నాగ్ ఓ చేతిలో గన్, మరో చేతిలో విస్కీ బాటిల్ పట్టుకోగా..నాని మెడలో స్టెతస్కోప్ తో ఉంది. సరికొత్తగా ఉన్న దేవదాస్ పోస్టర్ అభిమాన‌లని ఎంత‌గానో అల‌రించింది .సెప్టెంబ‌ర్ 13న చిత్రాన్ని విడుద‌ల చేయాల‌ని టీం భావిస్తుండ‌గా, త్వ‌ర‌లో టీజ‌ర్, ట్రైల‌ర్ కూడా విడుద‌ల చేయ‌నున్నారు.

× RELATED నాటు తుపాకీ స్వాధీనం: ఇంజినీరింగ్ విద్యార్ధి అరెస్టు