సంతృప్తినిచ్చిన విజయం

నాగార్జున, నాని ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం దేవదాస్ ఇటీవలే ప్రేక్షకులముందుకొచ్చింది. శ్రీరామ్ ఆదిత్య దర్శకుడు. వైజయంతీమూవీస్ పతాకంపై అశ్వనీదత్ నిర్మించారు. ఇటీవల హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో నాగార్జున మాట్లాడుతూ దేవదాస్ విడుదలైనప్పుడు నగరంలో లేను. కుటుంబంతో కలిసి వారంరోజుల పాటు విదేశాల్లో గడిపాను. దేవదాస్ విజయం ఎంతో సంతృప్తినిచ్చించి. తొలివారంలో 41కోట్ల వసూలు సాధించింది. దాస్ పాత్రలో నాని అద్భుతంగా నటించాడు. దర్శకుడు శ్రీరామ్‌ఆదిత్యకు మంచి భవిష్యత్తు ఉంది. నిర్మాత అశ్వనీదత్‌గారితో చాలా సినిమాలు చేశాను. ఆరంభం నుంచి అదే తపనతో సినిమాలు నిర్మిస్తున్నారాయన. ఈ మధ్యే 45ఏళ్లు పూర్తిచేసుకున్న వైజయంతీ మూవీస్ సంస్థ భవిష్యత్తులో మరిన్ని విజయాల్ని దక్కించుకోవాలని ఆకాంక్షిస్తున్నాను.

అక్టోబర్ నెల నాకు బాగా కలిసొస్తుంది. ఈ మాసంలో విడుదలైన శివ, నిన్నేపెళ్లాడతా, అల్లరి అల్లుడు వంటి చిత్రాలు ఘనవిజయం సాధించాయి అన్నారు. దేవదాస్ విజయం మా సంస్థ ను గర్వపడేలా చేసింది. ఈ సక్సెస్‌కు కారణమైన నాగార్జున, నాని, చిత్రబృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు. తెలుగు చిత్రసీమలో ఎన్టీఆర్, ఏఎన్నార్ కలిసి ఎక్కువ మల్టీస్టారర్స్ చేశారు. ఇప్పుడు నాగార్జున ఈ ట్రెండ్ సెట్ చేస్తున్నారు. కర్ణాటకలో కూడా ఈ సినిమాకు మంచి ఆదరణ లభిస్తున్నది అని నిర్మాత తెలిపారు. నాగార్జున అభిమానుల నుంచి తనకు ఎన్నో ప్రశంసలు లభిస్తున్నాయని దర్శకుడు చెప్పారు.

× RELATED వరుణ్‌ని చూస్తే ఈర్షగా వుంది!