స్మాల్ పెగ్ తో మాంచి కిక్ ఇచ్చిన నాని, నాగ్

టాలీవుడ్ లో తెరకెక్కుతున్న క్రేజీ మల్టీస్టారర్ చిత్రాలలో నాని, నాగ్ నటిస్తున్న దేవదాస్ మూవీ ఒకటి . శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై అభిమానులలో భారీ అంచనాలు ఉన్నాయి. వైజయంతి మూవీస్ పతాకంపై అశ్వినీదత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నాని సరసన ఛలో ఫేం రష్మిక మందాన, నాగార్జున సరసన ఆకాంక్ష సింగ్ కథానాయికలుగా నటిస్తున్నారు. సంపూర్ణేష్ బాబు కూడా చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ మూవీ కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందుతుందని తెలుస్తుంది. దేవదాస్ అనే టైటిల్ తో చిత్ర పోస్టర్ విడుదల కాగా, ఈ పోస్టర్పై గన్, బుల్లెట్స్, చారిటబుల్ హాస్పిటల్ హోర్డింగ్స్ ని ఉంచారు. ఈ పోస్టర్ ని బట్టి చూస్తుంటే దేవ్ అనే పాత్రలో డాన్ గా నాగ్, దాస్ అనే పాత్రలో డాక్టర్ గా నాని కనిపించనున్నట్టు అభిమానులు ఓ అంచనాకి వచ్చారు. చిత్ర నిర్మాణం చివరి దశలో ఉండగా సెప్టెంబర్ 27 చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్టు తెలుస్తుంది. మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. సీనియర్ నరేష్, రావ్ రమేష్, అవసరాల శ్రీనివాస్, బాహుబలి ప్రభాకర్, వెన్నెల కిషోర్, సత్య మొదలగువారు ఈ చిత్రంలో నటిస్తున్నారు. 1953లో ఏఎన్ఆర్ నటించిన చిత్రం దేవదాసు. తెలుగు సినిమాలో క్లాసిక్ మూవీగా నిలిచిన దేవదాస్ చిత్ర టైటిల్ని ఆయన తనయుడు నాగార్జున వాడుకోవడం విశేషం. తాజాగా చిత్ర టీజర్ విడుదల చేశారు మేకర్స్. ఇందులో నాగార్జున, నానిలు ప్రేక్షకులకి మంచి కిక్ ఇచ్చారు. టీజర్ తో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. మరి మీరు ఈ టీజర్ చూసి ఎంజాయ్ చేయండి.
× RELATED వంతెన పైనుంచి మహానదిలో పడ్డ బస్సు