ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టు నేత అరెస్ట్

కొత్తగూడెం క్రైం: ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లా జగ్దల్‌పూర్‌లో బుధవారం పోలీసులు అభయ్ దేవదాస్ నాయక్ అలియాస్ లోథా అనే మావోయిస్టు నేతను అదుపులోకి తీసుకున్నారు. 15 దేశాల్లో సంచరించిన అభయ్..సాంకేతిక పరిజ్ఞానం, సోషల్ నెట్‌వర్క్‌ను ఉపయోగించి మావోయిస్టులకు సహకరిస్తున్నాడని పోలీసులు పేర్కొన్నారు. వివిధ ప్రాంతాల్లో యువతను ఆకర్శించి మావోయిస్టుల బలోపేతానికి కృషి చేస్తున్నాడని తెలిపారు.