కొనసాగుతున్న అల్పపీడనం.. గ్రేటర్‌కు వర్షసూచన

హైదరాబాద్: బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, ఆవర్తన ప్రభావంతో రానున్న రెండు రోజుల్లో గ్రేటర్‌లోని పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. మరికొన్ని చోట్ల తేలికపాటి జల్లులు పడే వీలున్నట్లు అధికారులు తెలిపారు. వాతావరణంలో తేమ శాతం పెరుగడం కారణంగా చలిగాలులు వీచే అవకాశమున్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. గురువారం గ్రేటర్‌లోని పలు చోట్ల ఆకాశం మేఘావృతమై కనిపించింది.

Related Stories: