అనారోగ్య స‌మస్యతో బాధ‌ప‌డుతున్న దీపిక ..!

బాలీవుడ్ బ్యూటీ దీపిక ప‌దుకొణే రీసెంట్‌గా ప‌ద్మావ‌త్‌ చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో దీపికా ప‌ర్‌ఫార్మెన్స్‌కి ఫిదా కాని వారు లేరంటే అతిశ‌యోక్తి కాదు. రాణి ప‌ద్మావ‌తిగా దీపిక న‌ట‌న ప్ర‌తి ఒక్కరిని అల‌రించింది. ఈ సినిమా రిలీజ్‌కి ముందు దీపిక‌కి ఎన్నో బెదిరింపులు వ‌చ్చిన , ఎంతో ధైర్యంగా ఉంది. ఆమె ధీర‌త్వంపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిసింది. ఇక దీపిక త‌న త‌దుప‌రి చిత్రంగా సప్నా దీదీ అనే బయోపిక్ చేయనుంది. ముంబయిలోని నాగ్పాడాకు చెందిన మాఫియా క్వీన్ రహీమా ఖాన్ జీవితమాధారంగా ఈ సినిమాను విశాల్ భరద్వాజ్ తెరకెక్కించనున్నారు. ఈ నెల‌లోనే మూవీ సెట్స్‌పైకి వెళ్ళాల్సి ఉండ‌గా, అనారోగ్య స‌మ‌స్య‌తో దీపిక బాధ‌ప‌డుతున్న కార‌ణంగా షూటింగ్‌కి కాస్త‌ బ్రేక్ ఇచ్చిన‌ట్టు తెలుస్తుంది. విట‌మిన్ 3డీ లోపంతో బాధ‌ప‌డుతున్న దీపికని ఫిజియోథెల‌ర‌పీ చేయించుకొని, కొన్నాళ్ళు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఈ క్ర‌మంలో దీపిక ప్ర‌స్తుతం త‌న ఇంట్లో చికిత్స తీసుకుంటూ మ‌రోవైపు కొత్త క‌థ‌ల‌ని కూడా వింటుంద‌ని తెలుస్తుంది. సంజ‌య్ లీలా భ‌న్సాలీ ద‌ర్శ‌క‌త్వంలో రీసెంట్‌గా ప‌ద్మావ‌త్ చిత్రం చేసిన దీపిక ఆయ‌న డైరెక్ష‌న్‌లో మ‌రో సినిమా చేయ‌నున్నట్టు స‌మాచారం. దీనిపై క్లారిటీ రావ‌ల‌సి ఉంది.
× RELATED రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి