ఇటలీ వెడ్డింగ్ ఫొటోలు షేర్ చేసిన దీపిక

ముంబై: బాలీవుడ్ యాక్టర్లు రణ్‌వీర్‌సింగ్-దీపికా పదుకొనే వివాహ బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. అయితే దీప్‌వీర్ పెళ్లి వేడుకకు సంబధించిన కొన్ని ఫొటోలు మాత్రమే బయటకు వచ్చాయి. తాజాగా ఇటలీలో జరిగిన మెహిందీ, వివాహ వేడుక ఫొటోలను దీపికా పదుకొనే ఇన్‌స్ట్రాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంది. దీపికా పదుకొనే తల్లి ఉజాలా పదుకొనే, సోదరి అనీషా, రణ్‌వీర్ సింగ్ తల్లి అంజు, సోదరి రితికతోపాటు స్నేహితులు మెహిందీ సెర్మనీలో పాల్గొన్నారు. ఇరు కుటుంబ సభ్యులు సాంప్రదాయ దుస్తుల్లో ఉన్న దీప్‌వీర్ చుట్టూ చేరి సందడి చేశారు. రణ్‌వీర్ పాటలకు డ్యాన్స్ చేస్తూ అదరగొట్టాడు. వెడ్డింగ్ స్టిల్స్ ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్నాయి.

Related Stories: