తండ్రి విషయంలో మరోసారి ఎమోషనల్ అయిన దీపిక

పొడుగు కాళ్ళ సుందరి దీపిక పదుకొణే 2016వ సంవత్సరంలో జరిగిన ఫిల్మ్ ఫేర్ అవార్డుల కార్యక్రమంలో ‘పికు చిత్రానికి ఉత్తమ నటి అవార్డు గెలుచుకున్న సందర్భంగా తన తండ్రి రాసిన ఓ లెటర్ ని చదివి వినిపించింది. ఆ లెటర్ చదివే టైంలో తాను చాలా ఎమోషనల్ అయింది. ఇక రీసెంట్ గా ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో దీపిక తండ్రి ప్రకాశ్ పదుకొణే ఫస్ట్ లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డు అందుకున్న సందర్భంగా కాస్త ఎమోషనల్ అయింది. ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్స్ గెలుచుకున్న తొలి భారతీయుడు ప్రకాశ్ కాగా, భారత బ్యాడ్మింటన్ అసోషియేషన్ ఆఫ్ ఇండియా ప్రకాశ్ ని ఘనంగా సత్కరించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హాజరు అయ్యారు. ఆయన చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు ప్రకాశ్ పదుకొణే. దీపిక తన సిస్టర్ అనీషా ట్రెడిషనల్ డ్రెస్ లో కార్యక్రమానికి హాజరు అయ్యారు. దీపిక తల్లి ఉజ్జల కూడా అవార్డు కార్యక్రమంలో పాల్గొన్నారు.
× RELATED ఆ ముగ్గురు హీరోలు ఒకే ఫ్రేములో..