కొండచరియల ఘటన..29కి చేరిన మృతులు

మనీలా: పిలిప్పీన్స్‌లోని నాగా పర్వత ప్రాంతంలో (సెబు ఐలాండ్) కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 29కు చేరుకుంది. పిలిప్పీన్స్ పోలీసులు, సహాయక బృందాలు సహాయక చర్యలు వేగవంతం చేసి 29 మృతదేహాలను శిథిలాల నుంచి బయటకు తీసుకొచ్చాయి. చాలా మంది ప్రజల ఆచూకీ గల్లంతయింది. శిథిలాల కింద చిక్కుకున్న వారిని గుర్తించేందుకు అధికారులు, పోలీసుల బృందం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నది. కొండచరియలు విరిగిపడిన నేపథ్యంలో పరిసర ప్రాంతాల్లోని ప్రజలను ముందు జాగ్రత్తగా సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు పిలిప్పీన్స్ పోలీస్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

Related Stories: