డ్రగ్స్ అమ్మితే మరణశిక్షే : పంజాబ్ సీఎం

చంఢీఘడ్: మాదక ద్రవ్యాలను అమ్మేవారు కానీ స్మగ్లింగ్ చేసేవారికి కానీ మరణశిక్ష విధించాలని పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ తెలిపారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వానికి పంపినట్లు ఆయన తెలిపారు. తరతరాలుగా డ్రగ్ పెడ్లింగ్ అందర్నీ నాశనం చేస్తోందని, డ్రగ్స్‌ను అమ్మేవారికి కఠినమైన శిక్షను విధించాలన్నారు. పంజాబ్‌ను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
× RELATED వైర‌ల్‌గా మారిన మ‌జిలి లొకేష‌న్ పిక్స్