ప్రాణాలమీదకు తెచ్చిన ‘మందు’ పందెం

కోదాడ : మందు పందెం ఓవ్యక్తి ప్రాణాల మీదకు తెచ్చిన సంఘటన సూర్యాపేట జిల్లా కోదాడలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కోదాడ పట్టణ శివారులోని లారీ అసోసియేసన్ సమీపంలో ఇద్దరు లారీ డ్రైవర్లు సరదాగా మాట్లాడుకుంటూ ఫుల్ బాటిల్ విస్కీ నీరు కలుపకుండా తాగుతానని సాలార్జింగ్‌పేటకు చెందిన డ్రైవర్ మామిడి లక్ష్ష్మయ్య పందెం కాయగా.. మరో డ్రైవర్ బ్రిటిష్ అరగంటలో తాగితే రూ. 5వేలు ఇస్తానని పందెం కాశాడు. తాగిన తర్వాత ఏమైనా జరిగితే ఎవరికీ ఎలాంటి సంబంధం లేదని ఇరువురు ఓ మధ్యవర్తి వద్ద లెటర్ రాసి ఇచ్చారు. అనంతరం పావుగంటలో లక్ష్మయ్య ఫుల్ బాటిల్ మందు(ఎంసీ విస్కీ) గటగటా తాగి వెంటనే పడిపోయాడు. అది చూసిన డ్రైవర్ బ్రిటిష్ రూ. 5వేలు చేతిలో పెట్టి పారిపోయాడు. పడిపోయిన లక్ష్మయ్యను ప్రభుత్వ దవాఖానకు తరలించగా ప్రథమ చికిత్స చేసి మెరుగైన వైద్యసేవలకు ప్రైవేట్ దవాఖానకు తరలించారు.

Related Stories: