డాన్సింగ్ అంకుల్ సంజీవ్ మళ్లీ ఇరగదీశాడు.. వీడియో

డాన్సింగ్ అంకుల్ సంజీవ్ శ్రీవాత్సవ అలియాస్ డబ్బూ ది డాన్సర్ గుర్తున్నాడా మీకు. ఓ వెడ్డింగ్ స్టేజీ మీద గోవింద స్టెప్పులు వేసి ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు కదా అతడే ఇప్పుడు మళ్లీ లైమ్ లైట్‌లోకి వచ్చాడు. గోవింద డాన్స్ తర్వాత హృతిక్ రోహన్ డాన్స్ చేసి మైమరపించిన డబ్బూ తాజాగా మిథున్ చక్రవర్తి సాంగ్ జూలీ జూలీకి డాన్స్ వేసి ఉర్రూతలూగించాడు. మళ్లీ నెటిజన్లకు మాంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందించాడు. జీతా హైన్ షాన్ సే అనే సినిమాలోనిది ఆ సాంగ్. ఇక.. మనోడి డాన్స్‌కు నెటిజన్లు ఫిదా అవ్వడంతో పాటు వీడియోను వైరల్ చేస్తున్నారు.
× RELATED యువకుడి దారుణహత్య.. ప్రేమవ్యవహారం బయటపెట్టడమే కారణమా?