ఎయిర్ ఇండియా డైరెక్టర్‌గా పురందేశ్వరి

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 20:ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా స్వతంత్ర హోదా డైరెక్టర్‌గా డీ పురందేశ్వరి నియమితులయ్యారు. ఇందుకు సంబంధించి గురువారం సంస్థ ప్రత్యేక ఆదేశాలను జారీ చేసింది. మూడేండ్లపాటు ఆమె ఈ పదవిలో ఉండనున్నారు. ఎయిర్ ఇండియా బోర్డు ప్రతిపాదనకు అపాయింట్‌మెంట్ కమిటీ ఆఫ్ క్యాబినెట్ ఆమోదం తెలిపింది.