ప్ర‌ముఖ ఫిలిం మేక‌ర్ క‌న్నుమూత‌.. సంతాపం తెలిపిన రాష్ట్ర‌ప‌తి

ప్ర‌ముఖ గురువు, న‌టుడు, యాడ్ ఫిలిం మేక‌ర్ అలీక్యూ పడమ్సీ( 90) ఈ రోజు ఉద‌యం ముంబైలో క‌న్నుమూశారు. 1982లో వ‌చ్చిన చారిత్రాత్మ‌క చిత్రం గాంధీలో మొహ‌మ్మ‌ద్ అలీ జిన్నా అనే పాత్ర‌తో అంద‌రికి సుప‌రిచితం అయ్యారు. ఆ త‌ర్వాత దేశంలో ప్ర‌ముఖ ఎడ్వ‌ర్టైజింగ్ ఏజెన్సీ స్థాపించి ప‌లు ప్ర‌క‌ట‌న‌లు రూపొందించారు అలీక్యూ పడమ్సీ. స‌ర్ఫ్ యాడ్‌, లిరిల్ గ‌ర్ల్‌, చెర్రీ బ్లోసమ్ షూ పోలిష్ కోసం చెర్రీ చార్లీ, హ‌మారా బ‌జాజ్, ఎంఆర్ఎఫ్ మ్యూజిక‌ల్ మ్యాన్ వంటి మ‌ర‌పురాని ప్ర‌క‌ట‌నలు రూపొందించారు. బ్రాండ్ ఫాద‌ర్ ఆఫ్ ఇండియ‌న్ అడ్ద‌ర్టైజింగ్ అనే బిరుదు కూడా ఆయ‌న ద‌క్కించుకున్నారు. క్రియేటివ్ ఫీల్డ్‌లో ఆయ‌న అందించిన సేవ‌ల‌కి గాను 2000 సంవ‌త్స‌రంలో ప‌ద్మ‌శ్రీ అందుకున్నారు. 2012లో సంగీత్ నాట‌క్ అకాడ‌మీ టాగూర్ ర‌త్న అనే అవార్డు కూడా ఆయ‌న ద‌క్కించుకున్నారు. ఆయ‌న మృతికి రాష్ట్ర‌ప‌తి సంతాపం తెలిపారు. అతని కుటుంబ స‌భ్యుల‌కి, స్నేహితుల‌కి, స‌న్నిహితుల‌కి ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేశారు. ప‌లువురు ప్ర‌ముఖులు కూడా అలీక్యూ పడమ్సీ మృతికి సంతాపాన్ని తెలియ‌జేస్తూ ఆయ‌న‌తో ఉన్న అనుబంధాన్ని సోష‌ల్ మీడియా ద్వారా పంచుకున్నారు.

Related Stories: