మీకు లక్కీ లాటరీ తగిలింది...యువతికి గాలం

హైదరాబాద్ : మీరు ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన వస్తువుపై లక్కీ లాటరీ... మిమ్మల్ని వరించిందంటూ ఓ యువతికి సైబర్‌చీటర్లు రూ. 4.57 లక్షలు టోకరా వేశారు. వివరా ల్లోకి వెళ్తే..ముషీరాబాద్‌కు చెందిన స్నేహా ప్రైవేట్ ఉద్యోగి. ఆమె షాప్‌క్లూస్.కామ్‌లో ఆన్‌లైన్ పోర్టల్‌లో హెడ్‌సెట్ కొనుగోలు చేసింది. కొనుగోలు చేసిన మరుసటి రోజు షాప్‌క్లూస్ నుంచి మాట్లాడుతున్నామంటూ గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేశారు. మీరు ఫలాన వస్తువు కొన్నారు.. మీ చిరునామా ఇదంటూ ఆమె కు నమ్మకం కల్గించారు. మీ కొనుగోలుపై లాటరీ తీయడంతో సఫారీ కారు డ్రాలో మిమ్మల్ని వరించిందంటూ చెప్పారు. అయితే కారు తీసుకోకుంటే రూ. 12.80 లక్షల నగదును కూడా మీరు తీసుకోవచ్చని, డబ్బు కావాలో, కారు కావాలో తేల్చుకోండంటూ సూచించారు. దీంతో ఆమె తనకు డబ్బులు కావాలంటూ సూచించడంతో మీ వివరాలు పంపుతూ, రూ. 8,500 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించండంటూ సూచించారు.

వారి మాటలను పూర్తిగా నమ్మేసిన ఆమె.... వారు చెప్పినట్లు జీఎస్‌టీ, ఆదాయపన్ను, సర్వీస్ ట్యాక్స్ అంటూ రూ. 4.57 లక్షలు సైబర్‌చీటర్లు సూచించిన ఖాతాల్లో డిపాజిట్ చేసింది. అంతా చెల్లించిన తరువాత కూడా మరో రూ.25 వేలు చెల్లించాలంటూ చెబుతుండడంతో ఆమెకు అనుమానం వచ్చి సైబర్‌క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. దీం తో పోలీసులు ఇదంతా మోసమని ఆమెకు తేల్చి చెప్పారు. తను గతంలో ఉద్యోగం చేసి మానేశానని, పైసా పైసా కూడబెట్టుకోవడంతో పాటు, పీఎఫ్ డబ్బులన్నింటినీ దార పోశానంటూ తన ఆవేదనను పోలీసుల ఎదుట వ్యక్తం చేసింది. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని ఏసీపీ కేవీఎం ప్రసాద్ దర్యాప్తు చేపట్టారు.

× RELATED 3వేల యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైళ్ల కొనుగోలు..