చెన్నై టీమ్ వీరాభిమాని.. పెళ్లిపత్రిక ఎలా ఉందో చూడండి!

చెన్నై: కొందరు ప్లేయర్స్, టీమ్స్‌కు వీరాభిమానులు ఉంటారు. వాళ్లు ఏదో ఒక రకంగా తమ అభిమానాన్ని చాటుకుంటూ ఉంటారు. తాజాగా ఐపీఎల్ టీమ్ చెన్నై సూపర్ కింగ్స్, ఆ టీమ్ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీ వీరాభిమాని అయిన కే. వినోద్ అనే వ్యక్తి తన పెళ్లిపత్రికను వెరైటీగా ప్రింట్ చేయించాడు. అచ్చూ చెన్నై హోమ్ మ్యాచ్ టికెట్ రూపంలో ఈ వెడ్డింగ్ ఇన్విటేషన్ ఉండటం చాలా మందిని ఆకర్షిస్తున్నది. ధోనీ, చెన్నై టీమ్‌కు వీరాభిమానిగా ఏదైనా కొత్తగా చేయాలని భావించాను. అందుకే నా పెళ్లిపత్రికను ఇలా వెరైటీగా ప్రింట చేయించాను. సీఎస్‌కే అభిమాని, గ్రాఫిక్ డిజైనర్ అయిన నా ఫ్రెండ్ సాయంతో ఈ పత్రికను డిజైన్ చేయించాను అని వినోద్ చెప్పాడు. ఈ పత్రికను చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీయే తమ ట్విటర్‌లో పోస్ట్ చేయడం విశేషం. చెన్నై సూపర్ కింగ్స్‌కు సంబంధించిన ఎన్నో వీడియోల్లో వినోద్ ఉన్నాడు. అతనికి ధోనీ తాను ఆటోగ్రాఫ్ చేసిన బ్యాట్‌ను బహుమతిగా కూడా ఇచ్చాడు.

Related Stories: