బెంగళూరుపై ఫీల్డింగ్ ఎంచుకున్న చెన్నై

బెంగ‌ళూరు: ఐపీఎల్-2019 సీజన్‌లో మ‌రో ఆస‌క్తిక‌ర స‌మ‌రం ఆరంభ‌మైంది. బెంగ‌ళూరులోని చిన్న‌స్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. వెన్నునొప్పి కార‌ణంగా హైద‌రాబాద్‌తో మ్యాచ్‌కు విశ్రాంతి తీసుకున్న ధోనీ తిరిగి జ‌ట్టు ప‌గ్గాలు చేప‌ట్టాడు. గాయంతో కొన్ని మ్యాచ్‌ల‌కు దూరంగా ఉన్న డ్వేన్ బ్రావో తుదిజ‌ట్టులోకి వ‌చ్చిన‌ట్లు ధోనీ చెప్పాడు. మ‌రోవైపు మ‌హ్మ‌ద్ సిరాజ్ స్థానంలో ఉమేశ్ యాద‌వ్ టీమ్‌లోకి తీసుకున్న‌ట్లు కోహ్లీ వివ‌రించాడు. డివిలియ‌ర్స్ కూడా ఈ రోజు ఆడుతున్నాడు. ప్ర‌స్తుత‌ సీజన్‌లో 9 మ్యాచ్‌లు ఆడిన‌ చెన్నై ఏకంగా ఏడు మ్యాచ్‌ల్లో గెలుపొంది పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. బెంగళూరు జట్టు ఏడు మ్యాచ్‌ల్లో ఓడిపోయి పట్టికలో ఆఖ‌రి స్థానానికి పరిమితమైంది.
More in క్రీడలు :