ఉప్పల్ స్టేడియంలో మద్యం మత్తులో యువతీయువకుల హల్‌చల్

హైదరాబాద్: ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో కొంతమంది యువతీయువకులు మద్యం మత్తులో హల్‌చల్ చేశారు. ఐపీఎల్ మ్యాచ్‌ను వీక్షించేందుకు ఆరుగురు యువతీ యువకులు మద్యం సేవించి వచ్చారు. వీరందరిపై సంతోష్ ఉపాధ్యాయ్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆరుగురిపై ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేశారు. పూర్ణిమ, ప్రియ, ప్రశాంతి, శ్రీకాంత్‌రెడ్డి, సురేష్, వేణుగోపాల్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉప్ప‌ల్ వేదిక‌గా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైద‌రాబాద్‌ ఘన విజయం సాధించింది. 160 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన సన్‌రైజర్స్‌ కేవలం 15 ఓవర్లలోనే ఒక వికెట్‌ కోల్పోయి టార్గెట్‌ను ఛేదించింది. ఓపెనర్లు జానీ బెయిర్‌స్టో(80 నాటౌట్‌: 43 బంతుల్లో 7ఫోర్లు, 4సిక్సర్లు), డేవిడ్‌ వార్నర్‌(67: 38 బంతుల్లో 3ఫోర్లు, 5సిక్సర్లు) మెరుపు అర్ధశతకాలతో విజృంభించారు. దీంతో హైద‌రాబాద్ ఐదు ఓవ‌ర్లు మిగిలుండ‌గానే 9 వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది.
More in క్రీడలు :