అసెంబ్లీ రద్దుపై దాఖ‌లైన పిటిషన్ కొట్టివేత

హైదరాబాద్: అసెంబ్లీ రద్దును సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాన్ని హైకోర్టు కొట్టివేసింది. రాజ్యాంగం, చట్టాలు ఉల్లంఘించినట్లు పిటిషన్‌లో కన్పించడం లేదని హైకోర్టు పేర్కొంది. రాజ్యాంగ అంశాలకు సంబంధించి తాము జోక్యం చేసుకోలేమని హైకోర్టు వెల్లడించింది. కేవలం రాజకీయ పలుకుబడి కోసమే కోర్టులను ఆశ్రయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజాబలం లేక రాజ్యాంగబద్ధ సంస్థలపై కాంగ్రెస్ పార్టీ బురద జల్లుతోంది. నిన్న ఎన్నికల కమిషన్‌పై కూడా విపక్షాలు అనుచిత వ్యాఖ్యలు చేశాయి. అసెంబ్లీ రద్దును సవాల్ చేస్తూ న్యాయవాది రాపోలు భాస్కర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

Related Stories: