రేపే ఆ మూడు రాష్ర్టాల ఓట్ల లెక్కింపు

న్యూఢిల్లీ : ఈశాన్య రాష్ర్టాలైన త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్‌లో శాసనసభ స్థానాలకు ఇటీవలే ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ మూడు రాష్ర్టాల ఓట్ల లెక్కింపు శనివారం జరగనుంది. ఓట్ల లెక్కింపు నేపథ్యంలో మూడు రాష్ర్టాల్లో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. త్రిపురలో ఫిబ్రవరి 18న, మేఘాలయ, నాగాలాండ్‌లో ఫిబ్రవరి 27న ఎన్నికలు జరిగాయి. గత పదేళ్ల నుంచి మేఘాలయలో కాంగ్రెస్ అధికారంలో ఉండగా, నాగాలాండ్‌లో 2003 నుంచి నాగపీపుల్స్ ఫ్రంట్ అధికారంలో ఉంది. త్రిపురలో 25 ఏండ్లుగా అధికారంలో ఉన్న సీపీఎం ఈ సారి ఓటమి చవిచూసే అవకాశం ఉందని, బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలున్నాయని ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి. నాగాలాండ్, మేఘాలయ రాష్ర్టాల్లో కూడా బీజేపీ పాగా వేసే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ తేల్చిన విషంయ విదితమే.

Related Stories: