వినాయక చవితి ఏర్పాట్లపై సమన్వయ సమావేశం

హైదరాబాద్ : వినాయక చవితి ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమన్వయ సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం తరువాత కలెక్టరేట్‌లో నిర్వహించే ఈ సమావేశంలో రెవెన్యూ, ఇరిగేషన్, పోలీస్ శాఖలకు చెందిన అధికారులు పాల్గొననున్నారు. ఈనెల 25 నుంచి 9 రోజుల పాటు జరుగనున్న నవరాత్రి ఉత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు చేయడంతో పాటు నగర శివారు ప్రాంతాల్లోని చెరువులలోనే నిమజ్జనం ఏర్పాట్లు చేసేందుకు అధికారులు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా సమమృద్ధిగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో స్థానిక చెరువులలో నీరు పుష్కలంగా ఉండటంతో స్థానిక చెరువుల వద్దనే నిమజ్జన ఏర్పాట్లు చేసేందుకు అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.

Related Stories: