టీఆర్ఎస్ లోకి కొనసాగుతున్న వలసలు

యాదాద్రి భువనగిరి: టీఆర్ఎస్ లోకి వలసలు కొనసాగుతున్నాయి. సంస్థాన్ నారాయణపూర్ మండలంలోని వర్లగడ్డ తండా, ఆంబోతు తండాల నుండి వివిధ పార్టీలకు చెందిన సుమారు 300 వందల మంది కార్యకర్తలు టీఆర్ఎస్ లో చేరారు. టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అదేవిధంగా నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం అయిటిపాముల గ్రామ పంచాయతీ పరిధిలోని రసూల్ గూడెంకు చెందిన సింగిల్ విండో డైరెక్టర్ ముస్కు బాలరాజు, యువజన కాంగ్రెస్ నాయకుడు ముస్కు నరేష్ టీఆర్ఎస్ అభ్యర్థి వేముల వీరేశం సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు.

Related Stories: