టికెట్లు, పదవులు అమ్ముకుంటున్నరు: కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి

హైదరాబాద్: కాంగ్రెస్ పెద్దలపై కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మరోసారి నిప్పులు చెరిగారు. పీసీసీ క్రమశిక్షణ కమిటీ రాజగోపాల్ రెడ్డికి షోకాజు నోటీసు జారీ చేసింది. దీనిపై ఆయన హైదరాబాద్‌లోని తన నివాసంలో మీడియా ద్వారా మాట్లాడుతూ తీవ్రస్థాయిలో విమర్శించారు. గాంధీభవన్‌లో టికెట్లు, పదవులు అమ్ముకుంటున్నారన్నారు. సీఎం ఎలా కావాలి అనుకునేవారే తప్ప పార్టీని గెలిపించాలని తపన ఎవరికీ లేదన్నారు. పార్టీ అధికారంలోకి రావాలంటే తమలాంటి నాయకులను నమ్ముకోవాలి గానీ గాంధీభవన్‌లో కూర్చుని ప్రెస్‌మీట్‌లు పెట్టే వారిని కాదన్నారు. బూతులు తిట్టే వాళ్లకే పార్టీలో ప్రాధాన్యం ఇస్తారా అని ప్రశ్నించారు. కమిటీ పేర్లు ప్రకటించే ముందు పార్టీలో ఉన్నదెవరు, పార్టీని వీడిన వారెవరో చూసుకోరా అని పేర్కొన్నారు.

Related Stories: